తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహణపై మంత్రి సమీక్ష - ఇష్టా కాంగ్రెస్​

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విత్తన సదస్సు ఇష్టాకాంగ్రెస్​ - 2019 రాజధానిలో నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ఈ నెల 26 నుంచి జరిగే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్​ నార్సింగిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు.

విత్తన సదస్సు

By

Published : Jun 18, 2019, 6:08 PM IST

విత్తన సదస్సు నిర్వహణపై మంత్రి సమీక్ష

భాగ్యనగరం వేదికగా ప్రతిష్ఠాత్మకంగా ఇష్టాకాంగ్రెస్ - 2019 నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 26 నుంచి జులై 3 వరకు జరిగే అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లపై నార్సింగిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, కమీషనర్ రాహుల్ బొజ్జ, తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ కేశవులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు 70 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిరంజన్​రెడ్డి తెలిపారు.

రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు ఆహ్వానం

విత్తన సదస్సుకు అన్ని రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. విత్తన సాంకేతిక అంశాలు, రైతులతో సమావేశాలు, ప్రదర్శనలు, సదస్సుకు భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారులకు సూచించారు. సదస్సులో వివిధ దేశాల సంస్థలు 65 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరో రెండు మూడ్రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : ఇంటర్ బోర్డు ముందు ఒప్పంద అధ్యాపకుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details