వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో సీసీఐ ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో సీసీఐ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న జాతీయ స్థాయి అగ్రిటెక్ - 2020 ప్రదర్శన, సదస్సును పురస్కరించుకుని మంత్రి చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేశారు.
'తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చటమే లక్ష్యం' - AGRICULTURE MINISTER NIRANJANREDDY ON NEW POLICY AT CCI MEETING
రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల యువ రైతులు కూడా వ్యవసాయ రంగంలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారని మంత్రి వివరించారు.
AGRICULTURE MINISTER NIRANJANREDDY ON NEW POLICY AT CCI MEETING
కీలక వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, విజ్ఞానం, నూతన సాంకేతికత పరిజ్ఞానం తెలంగాణకు ఎలా తోడ్పడగలదో ఇందులో ప్రదర్శిస్తారని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు, ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: షాద్‌నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు
Last Updated : Nov 30, 2019, 8:12 AM IST