పంటల ప్రణాళిక ప్రకారం... తెలంగాణ రాష్ట్రానికి ఇఫ్కో సంస్థ నుంచి యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో ఇఫ్కో ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేందర్ కుమార్, జనరల్ మేనేజర్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. గత ఏడేళ్ల కాలంలో తెలంగాణలో వ్యవసాయ పంటల సాగు గణనీయంగా పెరిగిందని మంత్రి ప్రస్తావించారు. సాగునీటి సరఫరా, రైతు బంధు, రైతు బీమా, ఉచితంగా 24 గంటల కరెంట్ సరఫరా వల్ల వ్యవసాయంపై రైతులకు నమ్మకం కుదిరిందని తెలిపారు.
NIRANJAN REDDY: 'రాష్ట్రంలో నానో యూరియా ప్లాంటు ఏర్పాటు చేయాలి' - telangana varthalu
పంటల ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి యూరియా సరఫరా చేయాలని ఇఫ్కో సంస్థ ప్రతినిధులను మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు అంశంపై వారితో విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో వ్యవసాయ పంటల సాగు గణనీయంగా పెరిగిందని.. సాగుకు అనుగుణంగా రసాయన ఎరువులు సరఫరా చేయాలని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి పండుగ అనే పరిస్థితికి వచ్చిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ అనుకూల విధానాల వల్ల ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో 2వ స్థానానికి చేరిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ పంటల సాగుకు అనుగుణంగా రసాయన ఎరువులు సరఫరా చేయాలని తెలిపారు. దక్షిణ తెలంగాణలో ప్రతిష్టాత్మక నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు వల్ల దక్షిణ భారతదేశం మొత్తానికి అందుబాటులోకి వచ్చినట్లవుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: