సాగు రంగాన్ని సీఎం కేసీఆర్ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని (Niranjan Reddy On Rice Crop) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలంలో పండే వరి కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని (Niranjan Reddy On Rice Crop) కోరారు. యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు.
విత్తన కంపెనీలతో ఒప్పందమున్న రైతులు.. వరి వేసుకోవచ్చన్న నిరంజన్ రెడ్డి... మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చని పేర్కొన్నారు. యాసంగిలో వరిని ప్రభుత్వం (Niranjan Reddy On Rice Crop) కొనదని స్పష్టం చేశారు. వానాకాలం వరి పంటను మాత్రమే ప్రభుత్వం కొంటుందని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదే అని వెల్లడించారు.