ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020- 21 విద్యా సంవత్సరం సంబంధించి డిప్లోమా కోర్సుల ప్రవేశం కోసం విద్యార్థులకు కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌ల్లో రెండు సంవత్సరాల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయ డిప్లోమా కోర్సులతోపాటు మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 27 నుంచి నవంబరు 4 వరకు కౌన్సిలింగ్ జరగనుంది.
ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సిలింగ్ - ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
రాష్ట్రంలో 2020- 21 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లోమా కోర్సుల ప్రవేశం కోసం విద్యార్థులకు కౌన్సిలింగ్ తేదీలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈనెల 27 నుంచి నవంబర్ 4 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సెలింగ్
తెలంగాణ పాలిసెట్- 2020 ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయింపు ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు. ఇతర వివరాల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్: www.pjtsau.edu.in లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి