Telangana Governer In FTCCI Hyderabad :దేశంలో సహకార రంగం బలోపేతం, రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలో అఖిల భారత సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సహకార సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ టీఎస్ మార్క్‌ఫెడ్, గంగారెడ్డి, జాతీయ సహకార సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సుధీర్ మహాజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెద్ ప్రకాష్ సేథియా, ఇతర ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల సహకార ఉద్యమకారులు, నిపుణులు పాల్గొన్నారు.
దుబ్బాక సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారం
Co- Operative Socities Development In South India : పలు దేశాల్లో... ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో సహకార రంగంలో సవాళ్లు, విజయాలు నమోదు చేసుకుంటున్న సహకార సంఘాల విజయగాధలను గవర్నర్ తమిళిసై గుర్తుచేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలు, విధులు, భవిష్యత్తులో సహకార రంగ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి దృష్ట్యా క్షేత్రస్థాయిలో సహకార సంఘాల ద్వారా రైతులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే అన్నదాతల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గవర్నర్ తెలిపారు. వీటి ద్వారా వ్యవసాయంలో రాబడులు మరింత పెంచేందుకు, సహకార సంఘాలు మంచి తోడ్పాటు ఇవ్వాలని ప్రధాని ఆదేశమన్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో అఖిల భారత సహకార సంఘం వ్యవసాయం పట్ల నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు.
Kattangur Co operative Society : అన్నదాతకు అండగా.. రైతు ఉత్పత్తిదారుల సంఘం