కేరళ ప్రభుత్వంలాగే మధ్యాహ్న భోజనం సరుకులను విద్యార్థుల ఇళ్లకు ప్రభుత్వమే గ్రామ పంచాయతీల ద్వారా అందించాలని... రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, గిరిజన సంఘాల రాష్ట్ర కమిటీలు కోరాయి. ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ... సంఘాల నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
'మధ్యాహ్న భోజనం సరుకులు విద్యార్థుల ఇళ్లకే పంపించాలి' - mid day meals
కరోనా దృష్ట్యా విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరుకులను ఇళ్లకే పంపించాలని పలు కమిటీలు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశాయి. విద్యా సంస్థలు ప్రారంభం కావటానికి మరింత సమయం ఉన్నందున... పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కోరాయి.
జూన్ 14 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా... కరోనా దృష్ట్యా ఇప్పటి వరకు బడులు తెరవలేదన్నారు. విద్యా సంవత్సరం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా... అట్టడగు వర్గాలకు చెందిన పిల్లలు పౌష్టికాహారానికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో 1-5 తరగతుల విద్యార్థులు 54,348, 6-8 తరగతుల విద్యార్థులు 34,825, 9-10 తరగతి విద్యార్థులు 22,443 మందికి గతేడాది ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం అందించిందన్నారు.
దేశంలో వలస కార్మికులు పట్టణాల్లో పని చేసే అసంఘటిత కార్మికులు, పార్ట్‌టైం, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, విద్యావాంలటీర్లు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు వంటి అనేక రంగాలలో పని చేసేవారు తమ ఉపాది కోల్పోయరన్నారు. వీరికి చెయ్యడానికి పని లేదని... తినటానికి తిండి లేదని... ఈ తరుణంలో వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అలాగే అన్లైన్ తరగతుల పేరుతో ఫీజులు దోపిడి చేస్తున్న విద్యాసంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.