ఈ నెల 19న వ్యవసాయ డిగ్రీ చివరి దశ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కౌన్సిలింగ్‌కు సంబంధించిన ఫీజు వివరాలు, ర్యాంకులు, సంబంధిత సమగ్ర సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో చూడాలని సూచించారు. తెలంగాణ ఎంసెట్ -2019 ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్ నియమాలకు లోబడి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీటు పొందిన అభ్యర్థులు నిర్దేశిత ఫీజుతోపాటు అన్ని ధ్రువపత్రాలను వెంటనే అందజేయాలని, లేకుంటే సీటు రద్దు అవుతుందని తెలిపారు.
19న చివరి విడత వ్యవసాయ డిగ్రీ కౌన్సిలింగ్
రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో... డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 19న చివరి సంయుక్త కౌన్సిలింగ్ జరగనుంది.
19న చివరి విడత వ్యవసాయ డిగ్రీ కౌన్సిలింగ్