తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES: టీఎస్‌పీఎస్పీ లీకేజీ కేసులో రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

tspsc
tspsc

By

Published : Mar 14, 2023, 7:19 PM IST

19:16 March 14

టీఎస్‌పీఎస్పీ లీకేజీ కేసులో రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

  • టీఎస్‌పీఎస్పీ లీకేజీ కేసులో రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు
  • ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ఫిర్యాదు చేశారు: రిమాండ్‌ రిపోర్ట్‌
  • అడ్మిన్ విభాగ సహాయ కార్యదర్శి ఫిర్యాదు చేశారు: రిమాండ్‌ రిపోర్ట్‌
  • కంప్యూటర్ల నుంచి కీలక సమాచారం లీకైందని ఫిర్యాదు: రిమాండ్‌ రిపోర్ట్‌
  • అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్‌పై అనుమానం ఉందన్నారు: రిపోర్ట్‌
  • ఐపీసీ సెక్షన్ 409, 66బీ అండ్ సీ, ఐటీ యాక్ట్ సెక్షన్లుతో కేసు నమోదు
  • కమిషన్‌లో బేగంబజార్ పోలీసులు ఆధారాలు సేకరించారు: రిపోర్ట్‌
  • ఈనెల 13న బడంగ్‌పేట్‌లో ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు: రిమాండ్‌ రిపోర్ట్‌
  • కార్యదర్శి పేషీ నుంచి ఐపీ అడ్రస్‌, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ దొంగతనం

17:39 March 14

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ నిందితులకు 14రోజులు రిమాండ్

  • టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ నిందితులకు 14రోజులు రిమాండ్
  • 9 మంది నిందితులకు 14రోజులు రిమాండ్ విధించిన కోర్టు
  • నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించనున్న పోలీసులు

17:36 March 14

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

  • టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు రిమాండ్ రిపోర్‌లో కీలక అంశాలు
  • ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్లను తన వద్ద ఉంచుకున్న ప్రవీణ్
  • ఏఈ పేపర్‌ నకళ్లు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్‌ నకళ్లు సైతం స్వాధీనం

16:47 March 14

బీఆర్కే భవన్ వద్ద ఓయూ విద్యార్థి ఐకాస నిరసన

  • హైదరాబాద్‌: బీఆర్కే భవన్ వద్ద ఓయూ విద్యార్థి ఐకాస నిరసన
  • టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ఓయూ విద్యార్థి ఐకాస ఆందోళన
  • కమిషన్‌ ఛైర్మన్ రాజీనామా చేయాలని ఓయూ విద్యార్థి ఐకాస డిమాండ్
  • లీకేజీ బాధ్యులపై చర్యలకు ఓయూ విద్యార్థి ఐకాస డిమాండ్

16:24 March 14

  • టీఎస్‌పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి
  • హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో 9 మందికి వైద్య పరీక్షలు
  • నాంపల్లి కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులు

16:24 March 14

  • హైదరాబాద్‌: బీఆర్కే భవన్ వద్ద ఓయూ విద్యార్థి ఐకాస నిరసన
  • టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ఓయూ విద్యార్థి ఐకాస ఆందోళన
  • కమిషన్‌ ఛైర్మన్ రాజీనామా చేయాలని ఓయూ విద్యార్థి ఐకాస డిమాండ్
  • లీకేజీ బాధ్యులపై చర్యలకు ఓయూ విద్యార్థి ఐకాస డిమాండ్

15:13 March 14

టీఎస్‌పీఎస్సీ వద్ద అదనపు బలగాలు మోహరింపు

  • టీఎస్‌పీఎస్సీ వద్ద అదనపు బలగాలు మోహరింపు
  • వరుస ఆందోళనల దృష్ట్యా అదనపు బలగాలు మోహరింపు
  • 9మంది నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
  • వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

15:13 March 14

నాంపల్లిలోని టీఎస్‌పీఎస్పీని ముట్టడించిన బీఎస్పీ నేతలు

  • నాంపల్లిలోని టీఎస్‌పీఎస్పీని ముట్టడించిన బీఎస్పీ నేతలు
  • ప్రశ్నాపత్రాల లీకేజీలో బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్ పీఎస్‌కు తరలింపు

14:43 March 14

గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదు: విక్రమ్‌సింగ్‌

  • టీఎస్‌పీఎస్సీ లీకేజీపై అదనపు సీపీ విక్రమ్ సింగ్ వివరణ
  • టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతోంది: విక్రమ్‌సింగ్‌
  • ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్ట్ చేశాం: విక్రమ్‌సింగ్‌
  • గ్రూప్ 1 పేపర్ లీకేజీ విషయం మా దృష్టికి రాలేదు: విక్రమ్‌సింగ్‌
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదు: విక్రమ్‌సింగ్‌
  • వివిధ కోణాల్లో లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్నాం: విక్రమ్‌సింగ్‌

14:18 March 14

కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో నిరుద్యోగుల ఆందోళన

  • టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై నిరుద్యోగుల నిరసన
  • కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో నిరుద్యోగుల ఆందోళన
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

14:09 March 14

టీఎస్‌పీఎస్సీ వద్ద అదనపు బలగాలు మోహరింపు

  • టీఎస్‌పీఎస్సీ వద్ద అదనపు బలగాలు మోహరింపు
  • వరుస ఆందోళనల దృష్ట్యా అదనపు బలగాలు మోహరింపు
  • టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రతను పర్యవేక్షించిన శాంతి భద్రతల అదనపు సీపీ

14:07 March 14

టీఎస్​పీఎస్సీని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

  • టీఎస్‌పీఎస్సీని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు
  • ప్రశ్నాపత్రం లీక్‌ను నిరసిస్తూ ముట్టడికి యువ మోర్చా కార్యకర్తలు యత్నం
  • కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లిన యువ మోర్చా కార్యకర్తలు
  • టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
  • టీఎస్‌పీఎస్సీ బోర్డును ధ్వంసం చేసిన యువ మోర్చా కార్యకర్తలు
  • బీజేపీ యువ మోర్చా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
  • టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓయూలో ఆందోళన
  • ఓయూలో బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
  • టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ను ముట్టడించిన తెజస విద్యార్థి విభాగం
  • కమిషన్‌ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని తెజస డిమాండ్
  • కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించిన నేతల అరెస్టు

14:06 March 14

పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓయూలో ఆందోళన

  • టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓయూలో ఆందోళన
  • ఓయూలో బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
  • టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

14:03 March 14

గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను ప్రవీణ్‌ లీక్ చేసి ఉండొచ్చని అనుమానం

  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన నిందితుడు ప్రవీణ్
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో నిందితుడు ప్రవీణ్‌కు 103మార్కులు
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను ప్రవీణ్‌ లీక్ చేసి ఉండొచ్చని అనుమానం
  • ప్రవీణ్ ఓఎంఆర్‌ షీట్‌ను పరిశీలిస్తున్న టీఎస్‌పీఎస్సీ అధికారులు
  • ప్రవీణ్‌కు గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చినట్టు గుర్తింపు
  • 103 మార్కులు వచ్చినా మెయిన్స్‌కు అర్హత సాధించని ప్రవీణ్‌
  • బబ్లింగ్‌ పొరపాటుతో గ్రూప్‌1 మెయిన్స్‌కు అర్హత సాధించని ప్రవీణ్‌
  • 150కు 103 మార్కులు వచ్చే ప్రతిభ ప్రవీణ్‌కు ఉందా అనే కోణంలో ఆరా
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌ వచ్చిన సర్వర్‌ను పరిశీలిస్తున్న సైబర్ నిపుణులు
  • గ్రూప్‌ 1 పేపర్ లీక్ అయిందా లేదా అని పరిశీలిస్తున్న నిపుణులు

14:02 March 14

టీఎస్‌పీఎస్సీని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు

  • ప్రశ్నాపత్రం లీక్‌ను నిరసిస్తూ ముట్టడికి బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు యత్నం
  • కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లిన యువ మోర్చా కార్యకర్తలు
  • టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
  • టీఎస్‌పీఎస్సీ బోర్డును ధ్వంసం చేసిన యువ మోర్చా కార్యకర్తలు
  • బీజేపీయువ మోర్చా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
  • ప్రశ్నాపత్రం లీకుతో సంబంధం ఉన్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

13:52 March 14

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కదులుతున్న డొంక

  • టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
  • నిందితులు ప్రవీణ్, రేణుక ఫోన్‌లను ఎఫ్ఎస్ఎల్‌కు పంపిన పోలీసులు
  • ఇద్దరి మధ్య జరిగిన పూర్తి చాటింగ్ రికవరీ చేసే పనిలో పోలీసులు
  • రేణుక చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్టు తేల్చిన పోలీసులు
  • టౌన్ ప్లానింగ్, వెటర్నరీ పేపర్‌లను కూడా సంపాదించిన ప్రవీణ్‌
  • పేపర్లు చేతికి వచ్చినా ఒప్పందం కుదరక ఎవరికీ అమ్మని ప్రవీణ్‌
  • గతంలో ఏమైనా పేపర్లు లీక్ అయ్యాయా అని ఆరా తీస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details