సీఏఏను రద్దు చేయాలంటూ ఎగైనెస్ట్ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌరసత్వ నమోదు.. జాతీయ పౌర గణనకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు హైదరాబాద్లో తెలిపారు.
సీఏఏతో అమాయకులకే ప్రమాదం: జస్టిస్ చంద్రకుమార్ - justice chandra kumar convenor of the gainst caa, nrc, npr state committee
పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌరసత్వ నమోదు.. జాతీయ పౌర గణనను అలయన్స్ ఎగైనెస్ట్ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రాష్ట్ర కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మార్చి 1 నుంచి 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు.
జస్టిస్ చంద్రకుమార్
ఎన్పీఆర్ నిబంధనలు పూర్తిగా దళిత, గిరిజన, మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అందులోని ప్రశ్నలకు సరైన ఆధారాలు చూపని వారు పౌరసత్వం కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు ఈ ప్రక్రియతో నిర్బంధ గృహాలకు తరలించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'
TAGGED:
జస్టిస్ చంద్రకుమార్