తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటకీయం... అపోలోలోనే అటెండర్ చంద్రయ్యకు వైద్యం - in vijayareddy muder case attender chandraiah's healing

హైదరాబాద్​ అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి హత్య ఘటనలో తీవ్రంగా గాయపడిన అటెండర్​ చంద్రయ్యకు వైద్యం అందించలేం అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు చెతులెత్తేశారు. అక్కడి నుంచి ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ఏమైందో తెలియదు కానీ... గంట గడవ ముందే అధికారులు చంద్రయ్యను తిరిగి అపోలోకి తీసుకొచ్చారు.

మళ్లీ అపోలోలోనే.. అటెండర్​ చంద్రయ్య వైద్యం

By

Published : Nov 13, 2019, 12:25 PM IST

మళ్లీ అపోలోలోనే.. అటెండర్​ చంద్రయ్య వైద్యం

హైదరాబాద్ అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్​పై జరిగిన హత్య ఘటనలో తీవ్రంగా గాయపడి.. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న.. అటెండర్ చంద్రయ్యకు చికిత్స అందించలేం అంటూ వైద్యులు చేతులెత్తేసి.. ఓవైసీ హాస్పిటల్​కి తరలించారు. ఏమయిందో ఏమో తెలియదు కానీ.. తిరిగి గంటలోపే దీనిపై ప్రభుత్వం స్పందించి మళ్లీ డీఆర్డీఓ అపోలో హాస్పిటల్​కి వైద్యచికిత్స నిమిత్తం చంద్రయ్యను తీసుకొచ్చారు. ఇది గమనించిన చంద్రయ్య కుటుంబం ఏం జరుగుతుందో తెలియక ఒక్క సారిగా అవాక్కయ్యారు.

ABOUT THE AUTHOR

...view details