తెలంగాణ

telangana

ETV Bharat / state

దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి - బొల్లారం రాష్ట్రపతి నిలయం

President Draupadi Murmu Telangana tour: దక్షిణాది విడిది కోసం ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి  హైదరాబాద్ రావడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి వచ్చి వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.

President  Draupadi Murmu
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

By

Published : Dec 2, 2022, 5:32 PM IST

President Draupadi Murmu Telangana tour: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 28 న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్నట్లు సమాచారం. దక్షిణాది విడిది కోసం ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ రావడం సంప్రదాయంగా వస్తోంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. పూర్తి స్థాయి షెడ్యూల్ ఇంకా రాలేదు.

ఈ నెల 28 న హైదరాబాద్ వచ్చి 30 వ తేదీన తిరిగి దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అధికారిక షెడ్యూల్ వచ్చాక రాష్ట్రపతి పర్యటనకు పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details