కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మార్పుపై రాజీవ్ గాంధీ జయంతి తర్వాత కార్యకర్తలు, అభిమానులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ అడిగితే.. పీసీసీ తన పేరు రాయకుండానే అధిష్ఠానానికి జాబితా పంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయారం గాయారంలతో పార్టీ నిండిపోయిందని అన్నారు.
'పార్టీ మార్పుపై రాజీవ్ గాంధీ జయంతి తర్వాత నిర్ణయం' - పీసీసీ తీరు
తెలంగాణ పీసీసీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ జయంతి తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఆయారం గాయారంలతో కాంగ్రెస్ నిండిపోయింది