తెలంగాణ

telangana

ETV Bharat / state

మాదన్నపేట మార్కెట్​లో స్క్రీనింగ్ పరీక్షల తర్వాతే అనుమతి - Madannapet Rythubazar

హైదరాబాద్​ మాదన్నపేట రైతు బజార్​లో కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరమే మార్కెట్​లోనికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మాదన్నపేట మార్కెట్​లో స్ర్కీనింగ్ పరీక్షల తర్వాతే అనుమతి
మాదన్నపేట మార్కెట్​లో స్ర్కీనింగ్ పరీక్షల తర్వాతే అనుమతి

By

Published : May 10, 2020, 9:37 PM IST

హైదరాబాద్​లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాదన్నపేట రైతు బజార్లో కూరగాయల వ్యాపారులకు, కొనుగోలుదారులకు ఆరోగ్య శాఖ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రైతు బజార్​కు వచ్చే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన తర్వాతే ​లోనికి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.

కరోనా నివారణకు సమన్వయంతో కృషి..

ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్య నియమాలు పాటించాలని కోరారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. మార్కెటింగ్ శాఖ, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖలు సమస్వయంతో కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నాయని మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details