రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ప్రకటించిన రూ.25కోట్ల ఆర్థిక సహాయం.... పేద న్యాయవాదులందరికీ వర్తింపచేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు ఎదుట మహిళా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఆకస్మిక లాక్డౌన్ కారణంగా అనేక మంది అడ్వకేట్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 10 సంవత్సరాల ప్రాక్టీస్‌తో నిమిత్తం లేకుండా అందరికీ నిధులు సమకూరేలా చూడాలన్నారు.
నియమాల్లేకుండా నిధులను అందజేయాలి: న్యాయవాదులు - advocates protest at nampally for treasures released by government
తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదులకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని నిరుపేద న్యాయవాదులకు వర్తించేలా చూడాలని హైదరాబాద్ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు ఎదుట మహిళా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ప్రాక్టీస్‌తో నిమిత్తం లేకుండా నిధులు అందేలా చూడాలని కోరారు.
![నియమాల్లేకుండా నిధులను అందజేయాలి: న్యాయవాదులు advocates protest at nampally for treasures released by government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7219584-thumbnail-3x2-lawyer.jpg)
నియమాల్లేకుండా నిధులను అందజేయాలి: న్యాయవాదులు
నియమాల్లేకుండా నిధులను అందజేయాలి: న్యాయవాదులు
ఆర్థిక సహాయాన్ని 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వారికి వర్తింపజేస్తూ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు . తక్షణమే పదేళ్ల స్టాండింగ్ విధానాన్ని ఎత్తివేయాలి. ప్రాక్టీస్‌తో నిమిత్తం లేకుండా నిధులు అందజేయాలి. -మహిళా న్యాయవాదులు
ఇవీ చూడండి:గుడ్‌న్యూస్: రెండు వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం