పెద్దపల్లి జిల్లా మంథనిలో కలకలం రేపిన హైకోర్టు న్యాయవాదుల హత్యకు నిరసనగా పలువురు న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ హత్యోదంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు హైకోర్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు.
'దంపతులను హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలి' - telangana latest news
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలే దుండగులు న్యాయవాదులపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనను ఖండిస్తూ న్యాయవాదులు హైకోర్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'న్యాయవాద దంపతుల హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి'
పట్టపగలే నడిరోడ్డుపై న్యాయవాదులను దుండగులు నరికి చంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.