ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతకు... కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుబ్బారాయుడు రాసిన లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు... సునీతకు రాసిన లేఖను కేంద్ర గ్రీవెన్స్ సెల్‌కు సైతం సుబ్బారాయుడు పంపారు.
Viveka murder case: సాక్ష్యాలుంటే ఇవ్వాలంటూ సునీతకు లాయర్ లేఖ! - వివేకా కుమార్తె సునీత వార్తలు
ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని... ఆయన కుమార్తె సునీత, కేంద్ర గ్రీవెన్స్ సెల్‌కు కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు. ఈ లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది.

సునీతకు లాయర్ లేఖ
వైఎస్ వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రకారాగారం అతిథిగృహంలో నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వాచ్మెన్ రంగన్న, ఇద్దరు కుమారులతోపాటు పులివెందుల పెట్రోల్ బంక్ యజమాని సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.