తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి! - High Court lawyer Rachna Reddy

హైకోర్టు అడ్వకేట్‌ రచనారెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. త్వరలోనే రచనారెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

advocate rachana reddy meets bandi sanjay
భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి!

By

Published : Jul 5, 2022, 10:21 PM IST

తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఆమె కలిశారు. దీంతో రచనా రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల తరఫున హైకోర్టులో రచనా రెడ్డి కేసులు వేసి వాదించిన సంగతి తెలిసిందే. ఆమె వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రస్తావించడం గమనార్హం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details