ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులు, సంబంధింత కేసులపై మంగళవారం నుంచి రోజువారి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అమరావతికి సంబంధించిన 93 కేసులపై హైకోర్టు పూర్తి ధర్మాసనం విచారించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలపై ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై న్యాయస్థానం ఇప్పటికే స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. అవే ఉత్తర్వులు కొనసాగుతాయని వెల్లడించినట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.
రాజధాని బిల్లులపై మంగళవారం నుంచి పూర్తిస్థాయి విచారణ - ap high court on amaravathi news
ఏపీ రాజధాని బిల్లులపై మంగళవారం నుంచి పూర్తిస్థాయి రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించిందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్లో కేసుల విచారణ సాగుతుండగా.. అవసరమైతే ప్రత్యక్ష విచారణ జరిపే అవకాశం కూడా ఉందని తెలిపినట్లు పేర్కొన్నారు.
రాజధాని బిల్లులపై మంగళవారం నుంచి పూర్తిస్థాయి విచారణ
ఈ కేసులన్నీ చాలా ముఖ్యమైనవని... మంగళవారం నుంచి పూర్తి స్థాయి విచారణ జరపాలని కోర్టు నిర్ణయించిందని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం విచారణ ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. కీలక పత్రాలు పరిశీలన చేయాల్సి వచ్చినపుడు ప్రత్యక్ష విచారణ చేపడతామని.. అందుకు ఇరుపక్షాల వారు సిద్ధంగా ఉండాలని ధర్మాసనం చెప్పినట్లు న్యాయవాది వెల్లడించారు. పిటిషన్ నంబర్ల వారీగానే విచారణ జరగనుందని చెప్పారు.