తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి - Kalthi Neyee

కాదేది కల్తీకి అనర్హం... అన్నాడు ఓ మహాకవి. కల్తీరాయుళ్లు దేనిని వదలడం లేదు. మీర్​పేట్​ పీఎస్​ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా... మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.

adultration of ghee at meerpet in hyderabad
కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

By

Published : Dec 5, 2019, 1:10 PM IST

హైదరాబాద్ మీర్​పేట్ పీఎస్​ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మీర్​పేట్ పోలీసులు దాడి చేశారు.

ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... సుమారు 3.5 లక్షల విలువైన, కల్తీ నెయ్యి, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిర్వహకుడి కోసం గాలిస్తున్నారు.

కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

ఇవీ చూడండి: చదువు చాటున గంజాయ్‌... సరఫరా, వినియోగంలో విద్యార్థులు ముందు!

ABOUT THE AUTHOR

...view details