తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్యాకెట్​ పాలు కొనాలి.. గేదె పాలుగా అమ్మాలి..! - Adulterated milk selling at lb nagar news

స్వచ్ఛమైన గేదెపాలు, ఆవు పాల పేరుతో కల్తీ పాలను విక్రయిస్తున్నారు. అవునూ.. కిరాణా దుకాణాల్లో పాల ప్యాకెట్లు కొని.. అక్కడే క్యాన్లలో కలిపి.. స్వచ్ఛమైనవిగా అమ్ముతూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

adulterated-milk-selling-by-the-name-of-pure-milk-at-lb-nagar
ప్యాకెట్​ పాలు కొనాలి.. గేదె పాలుగా అమ్మాలి..!

By

Published : Mar 23, 2021, 10:11 AM IST

Updated : Mar 23, 2021, 10:23 AM IST

కరోనా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రజలు మునుపటి కంటే జాగ్రత్తగా ఉంటున్నారు. దీనినే ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు దోచుకుంటున్నారు.

ప్యాకెట్​ పాలు కొనాలి.. గేదె పాలుగా అమ్మాలి..!

ఎల్​.బి.నగర్ పరిధిలోని​ రాక్​టౌన్​ కాలనీ ఇలాంటి వ్యాపారమే జోరుగా సాగుతోంది. రోజువారీ దినచర్యలో భాగమైన పాలను కల్తీ చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. స్వచ్ఛమైన గేదె పాలు, ఆవు పాలంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.

దుకాణాల్లో దొరికే ప్యాకెట్ పాలను కొనుగోలు చేసి, వాటినే క్యాన్​లలో పోసుకుని స్వచ్ఛమైన పాల పేరుతో అమ్మేస్తున్నారు. దండిగా డబ్బులు దండుకుంటున్నారు. రోజూ మనకు పాలు పోసేవారే కదా అని నమ్మకంగా తీసుకుంటుంటే.. గుట్టుచప్పుడు కాకుండా మోసం చేస్తున్నారు. మన డబ్బులే తీసుకుని, మన ఆరోగ్యాలకే ముప్పు తెస్తున్నారు.

ఇదీ చూడండి: జనం కదిలితేనే జలభాగ్యం

Last Updated : Mar 23, 2021, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details