అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్ సీ వంటి పీజీ కోర్సుల్లో ఈనెల 28 వరకు చేరవచ్చునని యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లు, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు www.braouonline.inలో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గడువు పొడిగింపు - etv bharat
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువు అక్టోబరు 28 వరకు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్ సీ వంటి పీజీ కోర్సుల్లో ఈనెల 28 వరకు చేరవచ్చునని యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు.
![అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గడువు పొడిగింపు admitions extened in br ambedkar open university in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9272793-1045-9272793-1603367236710.jpg)
ఇంటర్మీడియట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల బోధన రుసుము చెల్లించ లేకపోయిన డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులతోపాటు.. పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు కట్టని వారు కూడా ఈనెల 28 వరకు చెల్లించవచ్చన్నారు.
ఇవీచూడండి:ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు