ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ ప్రకటన విడుదలైంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సుకు కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ క్రమంలో మొత్తం 60 సీట్లు ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు గత నెల 16న ప్రవేశ ప్రకటన విడుదల చేసిన వర్సిటీ.. తదుపరి చర్యలకు ఉపక్రమించింది.
జయశంకర్ వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - కమ్యూనిటీ సైన్స్ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల తాజా వార్తలు
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది. మొత్తం 60 సీట్ల భర్తీకి గత నెలలో ప్రవేశ ప్రకటన విడుదల చేసిన వర్సిటీ.. తదుపరి చర్యలకు ఉపక్రమించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్.ఎస్.సుధీర్‌కుమార్ వెల్లడించారు.
ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్ష లేదా ఎంపీసీ, బైపీసీ, ఎం.బైపీసీ గ్రూపుల్లో ఉత్తీర్ణులైన బాలికలు మాత్రమే ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఇంటర్మీడియట్, దాని సమానమైన పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్లు భర్తీ చేస్తామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్. ఎస్.సుధీర్ కుమార్ వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www.pjtsau.edu.in ని చూడొచ్చని తెలిపారు.
TAGGED:
pjtsau latest news