తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా - తెలంగాణ తాజా వార్తలు

TS HC On IAS, IPS cadre issue: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సహా.. 13 మంది కేడర్ కేటాయింపుల వివాదంపై విచారణను హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు తెలంగాణ కేడర్‌ను రద్దు చేస్తూ.. ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 13 మంది అధికారుల భవితవ్యం ఈనెల 27న విచారణలో తేలే అవకాశం ఉంది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Jan 20, 2023, 1:56 PM IST

TS HC On IAS, IPS cadre issue: తెలంగాణలో పనిచేసే 13 మంది ఐఏఎస్ ఐపీఎస్‌ కేడర్ కేటాయింపుల వివాదంపై విచారణను హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు తెలంగాణ కేడర్‌ను రద్దు చేస్తూ.. ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో... ఇవాళ్టి విచారణపై అందరి దృష్టి నెలకొంది. డీజీపీ అంజనీకుమార్ సహా.. 13 మంది కేడర్ కేటాయింపుల వివాద పిటిషన్లపై సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్పష్టంచేసింది.

Telangana High Court News Today: ఈ మేరకు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులను సవాలు చేస్తూ 13 మంది అధికారులు .. గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. "క్యాట్" 2016లో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2017లో కేంద్రం పరిధిలోని డీవోపీటీ...క్యాట్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఇటీవల సోమేష్ కుమార్‌ పిటిషన్‌లో తీర్పునిచ్చిన హైకోర్టు... ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. 13 మంది అధికారుల భవితవ్యం ఈనెల 27న విచారణలో తేలే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details