Delhi Liquor Scam Latest Update: దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాయిదా వేసింది. ఈ నెల 16 కి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 16 మ.3 గంటలకు బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కోరింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.
దిల్లీ లిక్కర్ స్కామ్.. బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా
15:53 February 09
దిల్లీ మద్యం కుంభకోణం
ఇక దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. ఈ స్కామ్‌లో ఈడీ మరొకరిని అరెస్టు చేసింది. చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు తరలించినట్లు రాజేశ్ జోషిపై ఆరోపణలు వచ్చాయి. కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు... ఆయణ్ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
ED arrests gautam malhotra in Delhi liquor scam: ఇక ఇప్పటికే మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను... ఈడీ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా నిన్న బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు చెప్పారు. అనంతరం బుచ్చిబాబు అరెస్టును అధికారికంగా వెల్లడించారు. వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: