రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఆదివాసీలు ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మిడియం బాబురావు తెలిపారు. రిజర్వేషన్లపై భాజపా తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆదివాసీలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు.
'ఆదివాసీ సమస్యలపై ఐక్య ఉద్యమాలు'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని మాజీ ఎంపీ , రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మిడియం బాబురావు చెప్పారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
'దేశంలో ఆదివాసీలకు గుర్తింపు లేకుండా పోయింది'
భారత ప్రభుత్వం 705 తెగలను గుర్తిస్తే వీరిలో 5 తప్ప మిగతా తెగల వారందరూ ప్రకృతిని ఆరాధించే వారేనని ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తూ... చివరకు ప్రభుత్వం నిర్బంధాన్ని ఎదుర్కొని సురక్షితంగా బయటపడిన సంతోష్ యాదవ్‌ను మంచ్ ప్రతినిధులు సన్మానించారు.
ఇవీ చూడండి: కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం