లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులకు, ఆశా వర్కర్లకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గోషామహల్ నియోజకవర్గం బేగంబజార్ డివిజన్లోని ఉస్మాన్ గంజ్, మారాజ్ గంజ్లలో ఉండే 500 మంది నిరుపేదలకు సరకులను అందజేశారు.
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్నహస్తం - నిత్యావసర సరకుల పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్ 500 మంది నిరుపేదలకు సరకులు అందజేశారు.
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్నహస్తం
లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ బేగంబజార్ మార్కెట్లో వలస కూలీలకు ఉపాధి లభించడం లేదని... వారి ఇబ్బందులను గుర్తించి తమ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నందకిషోర్ బిలాల్ తెలిపారు.
ఇవీ చూడండి: విలువైన భూములు పోయినా.. పరిహారం దక్కలేదు..