కరోనా కష్టకాలంలో పనులు లేక పూట గడవని నిరుపేదలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్న ఆస్తం అందిస్తోంది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ప్రతి రోజు 500 వందల మందికి వారానికి సరిపడే నిత్యవసర సరుకులు ట్రస్ట్ ఛైర్మన్ నందు కిషోర్ బిలాల్ పంపిణీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపుతో ఈ సేవా కార్యక్రమాన్ని ఈ నెల 29వరకు కొనసాగిస్తామని బిలాల్ తెలిపారు.
పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ - Lock down update
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రతి రోజు 500 వందల మందికి వారానికి సరిపడే నిత్యవసర సరుకులు అందిస్తూ... ప్రజల మన్ననలు పొందుతున్నారు.
Aditya charitable trust distributed groceries in goshamahal
ప్రజలు ఎవరు బయటకు రాకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు. తమకు ఏమి కావాలన్న తమ ట్రస్ట్ ను ఆశ్రయించాలని విజ్ఞప్తిచేశారు. తమ డివిజన్ లో ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్న ఆదిత్య ట్రస్ట్ ను కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ అభినందించారు.