తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత - ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోశామహల్ నియోజకవర్గ ప్రజలకు గత 62 రోజులుగా ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు.

aditya chritable trust distributed dadily commodities
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత

By

Published : May 31, 2020, 1:22 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నాంపల్లిలోని కట్టెల మండి ప్రజలకు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్ నిత్యావసర సరుకులను అందజేశారు. గోశామహల్ నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో గత 62 రోజుల నుంచీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అదేశాల మేరకు గోశామహల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని తమ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు నంద్ బిలాల్ స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి నియోజకవర్గంలో కరోనా టెస్టులతో పాటు శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కరోనాపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ABOUT THE AUTHOR

...view details