తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస కార్యకర్తలకు 25 కిలోల బియ్యం పంపిణీ - హైదరాబాద్ తెరాస కార్యకర్తలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సాయం

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న నిరుపేదలకు, తెరాస కార్యకర్తలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నంద కిషోర్ వ్యాస్ బిలాల్ 25 కిలోల బియ్యం, మాస్కులను అందజేశారు.

Distribution of 25 kg of rice to trs activists
తెరాస కార్యకర్తలకు 25 కిలోల బియ్యం పంపిణీ

By

Published : May 24, 2021, 2:26 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ... తెరాస కార్యకర్తలకు, నిరుపేదలకు అండగా నిలిచింది. హైదరాబాద్ బేగంబజార్ డివిజన్​లో రెండు వందల మంది తెరాస కార్యకర్తలకు ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకుడు నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్... ట్రస్ట్ సభ్యులతో కలిసి 25 కిలోల బియ్యం, ఎన్-95 మాస్కులను అందజేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని... ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... పోలీసులకు సహకరించాలన్నారు. గోశామహల్ నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు తమ ట్రస్ట్​ను ఆశ్రయించాలని నంద్ కిషోర్ తెలిపారు.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details