ఇంతటి విపత్కర సమయంలోనూ తమ వంతుగా ప్రజలకు సహాయ పడుతున్న పోలీసులకు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్95 మాస్కులను పంపిణీ చేశారు. ట్రస్టు సభ్యులు నందు వ్యాస బిలాల్, పూజా వ్యాస బిలాల్‌లు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఇన్ఛార్జీ ఏఆర్ శ్రీనివాస్‌కు మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మరికొంత మంది ట్రస్ట్ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
పోలీసులకు ఎన్95 మాస్కుల పంపిణీ - పోలీసులకు ఎన్95 మాస్కుల అందజేత
ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులకు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎన్95 మాస్కులను అందజేశారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
![పోలీసులకు ఎన్95 మాస్కుల పంపిణీ masks distribution to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:56:18:1621077978-tg-hyd-35-15-3000-mask-distribution-av-ts10008-15052021164911-1505f-1621077551-1002.jpg)
పోలీసులకు ఎన్95 మాస్కుల పంపిణీ
ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హైదరాబాద్ వెస్ట్ జోన్ ఇన్ఛార్జీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి:నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత