తెలంగాణ

telangana

ETV Bharat / state

వెలుగులోకి మరో ఆదిమానవుడి గుహ.. ఎక్కడంటే? - మొహిద్దీన్‌పురంలో మరో ఆదిమానవుడి గుహ

Primitive cave in Prakasam district: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో మరో ఆదిమానవుడి గుహ వెలుగు చూసింది. కంభం మండలం లింగాపురానికి చెందిన చరిత్ర అధ్యాపకురాలు కందుల సావిత్రి.. మొహిద్దీన్‌పురం గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న జంపలేరు వాగు సమీపంలో ఈ ఆదిమానవుడి గుహను ఆమె కనుగొన్నారు.

Primitive cave in Prakasam district
వెలుగులోకి మరో ఆదిమానవుడి గుహ

By

Published : Dec 26, 2022, 6:15 PM IST

Primitive Cave in Prakasam District: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో మరో ఆదిమానవుడి గుహ వెలుగులోకి వచ్చింది. కంభం మండలం లింగాపురానికి చెందిన చరిత్ర అధ్యాపకురాలు కందుల సావిత్రి.. మొహిద్దీన్‌పురం గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న జంపలేరు వాగు సమీపంలో మరో ఆదిమానవుడి గుహను కనుగొన్నారు.

ఆదివారం ఆమె గ్రామస్థులతో కలిసి ఆ ప్రాంతంలో వెతకడంతో ఈ గుహ కనిపించిందన్నారు. గతంలో భైరవకొండ సమీపంలో బయటపడ్డ గుహకు ఇక్కడి నుంచి దారి ఉందని తెలిపారు. గుహ లోపలి భాగం బూడిద రంగులో ఉందని ఆమె వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details