తెలంగాణ

telangana

ETV Bharat / state

మెకానిక్​ కుమారుడు... 218 ర్యాంకు సాధించాడు.. - Telangana Latest News

ఆ విద్యార్థి మెకానిక్ కుమారుడు. ఆర్థిక స్తోమత లేకపోయినా... పట్టుదలతో చదివాడు. ఎంసెట్​లో 218 ర్యాంకు సాధించాడు. అతనే హైదరాబాద్​కు చెందిన ఆదిల్​. ఐఏఎస్​ అయి.. పేద ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమంటున్నాడు. తన కథేంటో తెలుసుకుందాం.

Adil scored 218th rank in TS EAMSET
మెకానిక్​ కుమారుడు... 218 ర్యాంకు సాధించాడు..

By

Published : Oct 7, 2020, 10:01 AM IST

కారు మెకానిక్ విధులు నిర్వర్తిస్తూ... తన పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఆ తండ్రి కన్న కలలను కుమారుడు నిజం చేస్తున్నాడు. ఎంసెట్​లో 218 ర్యాంకు సాధించి తన ప్రతిభ కనబరిచారు. ముషీరాబాద్ బాకారం కృష్ణ కాలనీకి చెందిన మహ్మద్ సల్ఫీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన వృత్తి కారు మెకానిక్.

సికింద్రాబాద్​లో కారు వర్క్ షాప్ నిర్వహిస్తూ.. కుటుంబాన్ని చేస్తున్నారు. అతని మూడవ సంతానం ఆదిల్ ​ సల్ఫీ ఇంజనీరింగ్ విభాగంలో 218 ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 1208వ ర్యాంకు సాధించాడు. నల్లకుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. బాల్య దశ నుంచే చదువుపై మక్కువ ఉండడంతో తల్లి తండ్రులు ప్రోత్సహించారు. ఎంసెట్​లో 218వ ర్యాంకు రావడం ఆనందంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details