రాష్ట్రంలోని 590 తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి ధరణి వెబ్సైట్ ప్రారంభం అవుతుండడం, వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లు చేయాల్సిన నేపథ్యంలో ఆన్లైన్ సేవలకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేలా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.
'అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్' - తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్ సౌకర్యం
నెలకు రూ. 2000 మించకుండా రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్ కార్యాలయాలకే ధరణి, స్తిరాస్థుల సర్వే, మరెన్నో బాధ్యతలు అప్పగించినందుకే ఈ అంతర్జాల వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంటూ కలెక్టర్లకు ఐటీశాఖ లేఖరాసింది.
!['అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్' Additional Internet to the all mro offices in telangana state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9095508-303-9095508-1602142786600.jpg)
'అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్'
తహసీల్దార్ కార్యాలయాలకు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ద్వారా 12 ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన నెట్వర్క్ సదుపాయం ఉంది. దానికి అదనంగా మరో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించిన సర్కారు... స్థానికంగా ఉన్న మంచి నెట్వర్క్ కనెక్షన్ తీసుకోవాలని ఎమ్మార్వోలకు అనుమతించింది. నెలకు 2000 రూపాయలకు మించకుండా కనెక్షన్ తీసుకోవాలని చెప్తూ ఐటీశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది.
ఇదీ చూడండి:కొవిడ్, వైద్యశాఖలోని కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ