తెలంగాణ

telangana

ETV Bharat / state

Fuel Price: తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే.. - పెట్రోల్ రేటు

దీపావళి పర్వదినం వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గాయి.

fuel-price
ఇంధన ధరలు

By

Published : Nov 4, 2021, 9:14 AM IST

చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో తెలంగాణలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎక్సైజ్‌ సుంకంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించడంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై 12.79 చొప్పున ఊరట కలిగింది. దీంతో గురువారం నగరంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. డీజిల్‌ రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

రూ.7 చొప్పున తగ్గించిన ‘భాజపా’ రాష్ట్రాలు

చమురు ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించిన క్రమంలోనే దేశంలోని పలు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఈ మేరకు పెట్రోలు, డీజిల్‌ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. ఈ రెండు ఇంధనాలపై అసోం, మణిపుర్‌, త్రిపుర, గోవా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఫలితంగా కేంద్ర తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోలు రూ.12, డీజిల్‌ రూ.17 మేర చవక కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details