నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భద్రత మరింత పెంచేందుకు గోపాలపురం పోలీసులు కృషి చేస్తున్నట్లు నగర అదనపు కమిషనర్ చౌహాన్ తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన.. వారి పనితీరును, రికార్డులను పరిశీలించారు.
గోపాలపురం పోలీస్ స్టేషన్ను సందర్శించిన నగర అదనపు కమిషనర్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ను నగర అదనపు కమిషనర్ చౌహాన్ సందర్శించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో చేపడుతున్న భద్రతా చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గోపాలపురం పోలీస్ స్టేషన్ను సందర్శించిన నగర అదనపు కమిషనర్
స్టేషన్కి వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకుని వెంటనే కేసులు చేసి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని సూచించారు. పెండింగ్ కేసులను కూడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఇలాంటి రద్దీ ప్రదేశంలో ప్రయాణికుల అవసరాల మేరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'