హైదరాబాద్‌లోని డబీర్‌పురా కార్పొరేషన్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలను నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్ పర్యవేక్షించారు. 66 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
డబీర్‌పురా పుర పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన అదనపు సీపీ - hyderabad additional cp chauhan
హైదరాబాద్ డబీర్‌పురా మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్ పర్యవేక్షించారు.
![డబీర్‌పురా పుర పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన అదనపు సీపీ additional commissioner of police visited Dabeerpura municipality in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5797233-thumbnail-3x2-a.jpg)
డబీర్‌పురా పుర పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన అదనపు సీపీ
ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని డీఎస్ చౌహాన్ వెల్లడించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు సిటీ రిజర్వు పోలీసు బలగాలు అందుబాటులో ఉన్నాయని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
డబీర్‌పురా పుర పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన అదనపు సీపీ
- ఇదీ చూడండి : బ్యాలెట్ పేపర్లో ముందే వేసి ఉన్న సిరా..