తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన అదర్​సిన్హా...

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఇచ్చిన గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్​లో రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్​సిన్హా మొక్కలు నాటారు. మరో ముగ్గురు ఐఏఎస్​లకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు.

ADAR SINHA PLANTED PLANTS IN PUBLIC GARDEN IN D PART OF GREEN CHALLENGE
ADAR SINHA PLANTED PLANTS IN PUBLIC GARDEN IN D PART OF GREEN CHALLENGE

By

Published : Dec 3, 2019, 5:55 PM IST

హరిత తెలంగాణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా కోరారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఇచ్చిన గ్రీన్​ఛాంలెంజ్​లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్​లో అదర్​సిన్హా మొక్కలు నాటారు. తనను నామినేట్ చేసినందుకు రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, గౌరవ్ ఉప్పల్​తో పాటు సమాచార ప్రధాన కమిషనర్ రాజాసదారాంకు అదర్​సిన్హా గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ రూపంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషి చేస్తున్నారన్న అదర్ సిన్హా... వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని నిరూపించారని కొనియాడారు.

గ్రీన్ ఛాలెంజ్ అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించటంతో పాటు అన్ని వర్గాల వారినీ భాగస్వామ్యం చేసిందని... ఇదే స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని ఆకాంక్షించారు.

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన అదర్​సిన్హా...

ఇవి కూడా చదవండి:

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details