కరోనా వంటి విపత్కర పరిస్థితిలో యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమకు చేతనైన సాయం చేయాలని సినీనటి సంజన అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు, ఫేస్‌షీల్డ్, శానిటైజర్లు అందించారు.
మనోధైర్యమే కొవిడ్‌కు మందు: సంజన
మనోధైర్యంతోనే కరోనాను జయించవచ్చని సినీ నటి సంజన అన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు అధైర్యపడొద్దని... వైద్యుల సలహాలు పాటించి త్వరగా కోలుకోవాలని సూచించారు.
actress sanjana
లాక్‌డౌన్ కారణంగా పేదల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...వారికి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపాన సాయం చేయాలని, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి...ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని సంజన సూచించారు. తిరిగి పూర్వ రోజులు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెరాస నేత మన్నెం గోవర్ధన్, బియాండ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Atlanta: రాష్ట్ర ప్రభుత్వానికి 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల విరాళం