తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల(Tollywood Drugs Case) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ(ED) అధికారులు ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సింగ్(Rakul preet singh)ను ప్రశ్నిస్తున్నారు. విచారణ నిమిత్తం రకుల్.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చారు. రకుల్‌ను ఈడీ అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు.
మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎఫ్ క్లబ్ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు కెల్వీన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ రకుల్‌కు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ సప్లై, ఎఫ్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.