డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి ముమైత్‌ఖాన్ - డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ముమైత్ ఖాన్
18:00 October 01
డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి ముమైత్‌ఖాన్
గోవాకు వెళ్లి క్యాబ్‌కు డబ్బులు చెల్లించలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న క్యాబ్ డ్రైవర్‌పై సినీనటి ముమైత్ ఖాన్ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను క్యాబ్‌లో గోవాకు వెళ్లానని డ్రైవర్‌కు అందుకు సంబంధించి 23,500 రూపాయలు చెల్లించినట్లు ఆమె తెలిపారు.
డ్రైవర్ కారును వేగంతో నిర్లక్ష్యంగా నడిపినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాబ్ డ్రైవర్ నుంచి వేధింపులు కూడా ఎదురయ్యాయని అన్నారు. డ్రైవర్ రాజు డబ్బులు చెల్లించలేదంటూ తనపై దుష్ఫ్రచారం చేస్తున్నాడని ఇది అవాస్తవమని వివరించారు. అందుకు సంబంధించిన ఆధారాలను ఆమె పోలీసులకు చూపించారు.
ఇదీ చూడండి :గ్రేటర్ పరిధిలో మొదలైన ఆస్తుల నమోదు ప్రక్రియ