కంచిపట్టు చీర... పసిడి కాంతుల మెరుపుల మధ్య సినీ కథానాయిక మధుశాలిని పుత్తడిబొమ్మలా మెరిసిపోయారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్టలోని టీబీజెడ్ ది ఒరిజినల్ ఆభరణాల షాపులో మంగళ పేరిట ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సరికొత్త కలెక్షన్స్ను ఆవిష్కరించి సందడి చేశారు. భారతీయ వస్త్రాభరణాలు అంటే చాలా ఇష్టమని మధుశాలిని అన్నారు. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మగువలు మెచ్చే వడ్డాణాలు, హారాలు, చోటీస్ తదితర అభరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు టీబీజెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆభరణాల షాపులో సందడి చేసిన సినీ నటి మధుశాలిని
హైదరాబాద్లోని పంజాగుట్టలో కథానాయిక మధుశాలిని టీబీజెడ్ ఆభరణాల షాపులో సందడి చేశారు. సరికొత్త కలెక్షన్ బంగారు, వజ్రాభరణాలతో మెరిసిపోయారు.
ఆభరణాల షాపులో సందడి చేసిన సినీ నటి మధుశాలిని