తెలంగాణ

telangana

ETV Bharat / state

Actress Hema: నేను అసలు పబ్‌కే వెళ్లలేదు: నటి హేమ - నేను అసలు పబ్‌కే వెళ్లలేదు: నటి హేమ

Actress Hema: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ డ్రగ్స్‌ కేసులో తన పేరును ప్రచారం చేయడంపై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఛానళ్లలో తనను బద్నాం చేసేలా వార్తలు వేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.

Actress Hema: నేను అసలు పబ్‌కే వెళ్లలేదు: నటి హేమ
Actress Hema: నేను అసలు పబ్‌కే వెళ్లలేదు: నటి హేమ

By

Published : Apr 3, 2022, 2:15 PM IST

Actress Hema: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆసమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్‌ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని పలు ఛానళ్లల్లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తోన్న సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

‘‘నేను అసలు పబ్‌కే వెళ్లలేదు. డ్రగ్స్‌ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొందరు కావాలనే నా పేరుని ప్రసారం చేస్తున్నారు. నన్ను బద్నాం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చా’’ -నటి హేమ

నేను అసలు పబ్‌కే వెళ్లలేదు: నటి హేమ

ఇదీ చదవండి:పుడింగ్​ అండ్​ మింక్​ పబ్​లో పట్టుబడిన వారిలో సినీ ప్రముఖులు.. జాబితాలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్

ABOUT THE AUTHOR

...view details