సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని జలమండలి సిబ్బందికి సినీ నటి అలేఖ్య అధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సీతాఫల్మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపసభాపతి పద్మారావు గౌడ్ హాజరై సరుకులు అందజేశారు.
జలమండలి సిబ్బందికి సినీ నటి అలేఖ్య చేయూత - corona effect
సినీ నటి అలేఖ్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని జలమండలి సిబ్బందికి నిత్యావరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుగౌడ్ హాజరై.. జలమండలి సిబ్బంది సేవలను కొనియాడారు.
![జలమండలి సిబ్బందికి సినీ నటి అలేఖ్య చేయూత actress alekhya distributed groceries to jala mandali employees in secundrabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7128904-565-7128904-1589025962597.jpg)
జలమండలి సిబ్బందికి సినీ నటి అలేఖ్య చేయూత
జంటనగరాల్లో నీటి, మురుగు సమస్యలు తలెత్తకుండా జలమండలి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని పద్మారావుగౌడ్ కొనియాడారు. కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, జలమండలి జీఎం రమణా రెడ్డి, డీజీ ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.