తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రముఖుల నివాళి - కోడి రామకృష్ణ మృతి

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

సినీనటులు

By

Published : Feb 23, 2019, 4:54 AM IST

Updated : Feb 23, 2019, 5:16 AM IST

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రామకృష్ణ మృతి తనను కలచివేసిందని ప్రముఖ నటి జయసుధ పేర్కొన్నారు. చలన చిత్ర చరిత్రలో తన పేజీ తానే రాసుకున్న గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ అని పరుచూరి గోపాలకృష్ణ కొనియాడారు. తనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మహానుభావుడు కోడి రామకృష్ణ అని ప్రముఖ నటుడు అర్జున్​ తెలిపారు. ఆయన మరణం బాధాకరమని అన్నారు. ఇవాళ హైదరాబాద్ మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రముఖులు సంతాపం
Last Updated : Feb 23, 2019, 5:16 AM IST

ABOUT THE AUTHOR

...view details