తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాన్సర్​పై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరం: సుమంత్​

క్యాన్సర్​పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సినీ నటుడు సుమంత్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్​ మాదాపూర్​లోని మెడికవర్ ఆస్పత్రి నిర్వహించిన బైక్‌ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు.

actor sumanth cancer awareness bike ryally inaugurated in hyderabad
క్యాన్సర్​పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి: సుమంత్​

By

Published : Feb 4, 2021, 10:57 AM IST

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని... హైదరాబాద్‌ మాదాపూర్​లో నిర్వహించిన బైక్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మాదాపూర్‌లో చేపట్టిన బైక్​ ర్యాలీని సినీ నటుడు సుమంత్‌ ప్రారంభించారు.

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చునని.. ప్రతిఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చిన్నచిన్న ఆరోగ్య సూత్రాలతో క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చని వైద్యనిపుణులు అవగాహన కల్పించారు. ఈ బైక్​ ర్యాలీలో 200 మంది బైకర్స్ పాల్గొన్నారు.

క్యాన్సర్​పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి: సుమంత్​

ఇదీ చదవండి:అర్ధరాత్రి దొంగల బీభత్సం.. తొమ్మిది దుకాణాల్లో చోరీ

ABOUT THE AUTHOR

...view details