త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్న మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నటుడు సుమన్ ప్రకటించారు. కేటీఆర్ లాంటి యువకుడు ముఖ్యమంత్రి అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్... నిర్మాత సి.కల్యాణ్‌తో కలిసి ప్రజాడైరీని ఆవిష్కరించారు.
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: నటుడు సుమన్ - తెలంగాణ వార్తలు
రాష్ట్రానికి త్వరలో ముఖ్యమంత్రి కాబోయే మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నటుడు సుమన్ ప్రకటించారు. కేటీఆర్ లాంటి యువకుడు సీఎం అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. నిర్మాత సి.కల్యాణ్‌తో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాడైరీని ఆవిష్కరించారు.
![కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: నటుడు సుమన్ actor-suman-wishes-minister-ktr-will-cm-to-telangana-state-at-somajiguda-press-club-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10374062-thumbnail-3x2-suman---copy.jpg)
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: సుమన్
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: సుమన్
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకీ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పోరాటం, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ కల సాకారమైందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ కావడం స్వాగతించదగ్గ విషయంగా పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:పీపుల్స్ ప్లాజా వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా!