తెలంగాణ

telangana

ETV Bharat / state

Rana inaugurated marut drones: 'డ్రోన్స్​ ద్వారా సీడ్​ బాల్స్​ వెదజల్లడం శుభ పరిణామం' - actor rana started seed balls by drones in kbr park

మనిషి మనుగడ అంతరించిపోకుండా సాంకేతికతను(Rana inaugurated marut drones) ఉపయోగించటం గొప్పవిషయమని సినీనటుడు దగ్గుబాటి రానా పేర్కొన్నారు. హైదరాబాద్‌ కేబీఆర్​ పార్కులో ఐటీ, అటవీశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన మారట్‌ డ్రోన్స్‌ను రానా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మారట్‌ డ్రోన్స్‌ ద్వారా సీడ్‌ బాల్స్(seed balls by drones) ​ను వెదజల్లనున్నారు.

Rana inaugurated marut drones
డ్రోన్స్​ ద్వారా సీడ్​ బాల్స్​

By

Published : Oct 1, 2021, 3:00 PM IST

డ్రోన్స్​ ద్వారా సీడ్ బాల్స్(seed balls by drones) వెదజల్లే కార్యక్రమాలు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చేస్తుంటారని... మన ప్రాంతంలో వీటిని ప్రయోగించటం శుభపరిణామని సినీనటుడు దగ్గుబాటి రానా అన్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని కేబీఆర్​ పార్కులో మారట్​ డ్రోన్స్(Rana inaugurated marut drones)​ను రానా ప్రారంభించారు. తెలంగాణ ఐటీ, అటవీశాఖల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మనిషి మనుగడను కాపాడటం కోసం సాంకేతికను వినియోగించడం గొప్ప విషయం. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే డ్రోన్స్(Rana inaugurated marut drones)​ వినియోగించడం లాంటి వార్తలు వింటుంటాం. మన దేశంలోనూ డ్రోన్స్​ ద్వారా విత్తనాలు వెదజల్లే కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం, ప్రజల మద్దతు చాలా అవసరం. -రానా దగ్గుబాటి, సినీ నటుడు

డ్రోన్స్​ ద్వారా 2030కల్లా 100 కోట్ల విత్తనాలు వేయనున్నామని... తెలంగాణలో ఈ ఏడాది అన్ని జిల్లాల్లో కలిపి 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నామని మారట్ డ్రోన్స్(Rana inaugurated marut drones) వ్యవస్థాపకులు ప్రేమ్​ కుమార్​ తెలిపారు. హర బహారా పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని... ఏరియల్ సీడింగ్ విషయంలో భారత్​లో ఇదే మొదటిదని పేర్కొన్నారు. కార్మికులు చేరుకోలేని ప్రాంతాల్లో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నామని.. స్థానికంగా పెరిగే మొక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

డ్రోన్స్​ ద్వారా సీడ్​ బాల్స్​ వెదజల్లడం శుభ పరిణామం: రానా

ఇదీ చదవండి:Scam In Telugu Academy: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌పై సీసీఎస్ దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details