ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి 14 రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటానని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ నటిస్తున్న చిత్రం కోసం ఇటీవలే జార్జియా వెళ్లిన ప్రియదర్శి షూటింగ్ ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చారు.
14 రోజులు ఇంట్లోనే ఉంటా: నటుడు ప్రియదర్శి - coronavirus treatment
కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. 14 రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటానని ట్వీట్ చేశారు.
ఇంట్లోనే ఉంటానంటున్న ప్రియదర్శి
శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి వైద్యులు స్క్రీనింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు సామాజికంగా ప్రజలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజులు ఇంటికే పరిమితమవుతున్నట్లు ప్రియదర్శి తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల