వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో రద్దీ, ప్రేక్షకులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై పవన్ స్టార్ పవన్‌కల్యాణ్ స్పందించారు. ప్రేక్షకులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి సినిమాలు చూడాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తన తాజా చిత్రం వకీల్ సాబ్.. విడుదలైన అన్ని కేంద్రాల్లో కిక్కిరిసిన ప్రేక్షకులతో ప్రదర్శితమవుతోంది. కరోనా రెండో దశ తీవ్రత దృష్ట్యా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు మాస్కులు ధరించాలని పవన్ కోరారు.
మాస్కులు ధరించి సినిమా చూడండి.. ప్రేక్షకులకు పవన్ విజ్ఞప్తి - Pawan Kalyan appealed to the audience
ప్రేక్షకులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాలు చూడాలని నటుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తి విజృంభణను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. తన తాజా చిత్రం వకీల్ సాబ్ విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు చేశారు.

వకీల్‌సాబ్, పవన్ విజ్ఞప్తి
పవన్ విజ్ఞప్తి: ప్రేక్షకులంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలి
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌ను దర్శక నిర్మాతలు వేణుశ్రీరామ్, దిల్ రాజు, కథానాయికలు అంజలి, అనన్యలు సందర్శించి ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వకీల్ సాబ్‌కు లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్న దిల్ రాజు... పవన్ కల్యాణ్ చేసిన సూచనలను ప్రేక్షకులకు వివరించారు.
ఇదీ చదవండి:శునకాల కోసం పెట్ పార్కు.. ఎక్కడో తెలుసా?